Crime News : 15 ఎకరాల చెరుకు తోట దగ్ధం

ప్రమాదవశాత్తు చెరుకు తోట దగ్ధమైన ఘటన మండలం లో చోటు చేసుకుంది.

Crime News : 15 ఎకరాల చెరుకు తోట దగ్ధం

నేలకొండపల్లి,  మన సాక్షి :

ప్రమాదవశాత్తు చెరుకు తోట దగ్ధమైన ఘటన మండలం లో చోటు చేసుకుంది. బాధిత రైతుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ALSO REÀD : Viral : రేవంత్ రెడ్డి పూజల ఫోటోలు, కామెంట్ సోషల్ మీడియాలో వైరల్..!

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని రాజేశ్వరపురం లో బుధవారం గ్రామానికి చెందిన నెల్లూరి రామకృష్ణ, వీరవెల్లి సత్యనారాయణ, మండల నాగేశ్వరరావు అనే రైతులకు చెందిన చెరుకు తోట పరిసర ప్రాంతంలో ఓ రైతు వరికొయ్య కాలు తగలబెడుతుండుగా, ప్రమాదవశాత్తు నిప్పు రవ్వలు వచ్చి చెరుకు తోట పై పడింది.

అంతే దాదాపు 15 ఎకరాల చెరకు తోట అగ్ని కి అహుతైంది. మంటల ను అర్చేందుకు ఫైరింజన్ వచ్చిన్సటీకీ చెరుకు తోట ల వద్దకు రహదారి సౌకర్యం వీలుగా లేకపోవటంతో మంటలను అదుపు చేసేందుకు సాధ్యం కాలేదు.

ALSO ŔEAD : Political News : తెలంగాణ ఆ పార్టీకి పేటెంటా.. పార్టీ పేరులోనే తెలంగాణ పదం తొలగించిన వారికా, మరి ఎవరికి..!

చేసేది లేక రైతులు కాలువ నీటిని బిందెలతో తీసుకొచ్చి -పొలాల సరిహద్దుల వద్ద నీటితో తడపటంతో మంటలు వ్యాపించలేదు. లేకుంటే ఆ ప్రాంతంలో ఉన్న చెరకు తోటలు పూర్తిగా కాలిపోయేవి.