Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

Political News : తెలంగాణ ఆ పార్టీకి పేటెంటా.. పార్టీ పేరులోనే తెలంగాణ పదం తొలగించిన వారికా, మరి ఎవరికి..!

Political News : తెలంగాణ ఆ పార్టీకి పేటెంటా.. పార్టీ పేరులోనే తెలంగాణ పదం తొలగించిన వారికా, మరి ఎవరికి..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేవలం రెండు రోజులు మాత్రమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రచారం ముగిసింది. దాంతో పాటు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా సాగింది. ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఇక అన్ని పార్టీలు కూడా ఒకరిపై ఎవరి పార్టీ వాళ్ళదే గెలుపొందుతుందని అధికారంలోకి రాబోతున్నాం అనే ప్రచారం జోరుగా చేసుకుంటున్నారు.

ఒకవైపు అధికార బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని, కాగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా రెబెల్ ను లేకుండా పోటీలో దించడంతోపాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు మల్చుకొని తామే అధికారం చేపట్టబోతున్నామని ప్రచారం జోరుగా సాగింది. ఈ రెండు పార్టీలు ముమ్మర ప్రచారాలు చేసుకోగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎన్నికల్లో అగ్రనాయకులతో ప్రచారాలు ముమ్మరం చేశారు.

ALSO READ : మిర్యాలగూడ : ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. గెలిచేది అతడేనా..!

తెలంగాణ ఎవరికి పేటెంట్ :

తెలంగాణ తమకే పేటెంట్ అంటూ మూడు పార్టీలు కూడా ప్రచారం జోరుగా చేసుకున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తమ ఉద్యమాల వల్లనే తెలంగాణ సాధించామని, తెలంగాణ పదం తమ పార్టీకే వర్తిస్తుందని అనేక బహిరంగ సభలలో ప్రచారం చేసుకున్నారు ఆ పార్టీ నాయకులు. రెండు పర్యాయాలు కూడా ఆ పార్టీ టిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరుతో ఎన్నికల బరిలోకి దిగింది. ప్రజలు కూడా పార్టీ పేరులోనే తెలంగాణ ఉందని ఉద్యమాలు చేపట్టిన పార్టీగా గుర్తించి అధికారం ఇచ్చారు.

కానీ ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ పార్టీ అధినేత పేరు మార్చి ఎన్నికల్లోకి దిగారు. పార్టీ పేరులో తెలంగాణ లేకుండా (భారత రాష్ట్ర సమితి) బి.ఆర్.ఎస్ పేరుతో ఎన్నికల్లోకి దిగారు. రెండు పర్యాయాలు కూడా తెలంగాణ సెంటిమెంటుతో ప్రజలు పట్టం కట్టారు. కానీ ఈసారి పార్టీ పేరులోనే తెలంగాణ పదం కూడా లేకుండా బరిలోకి దిగి తమకే తెలంగాణ పేటెంట్ అంటున్న బీఆర్ఎస్ కు ప్రజలు ఎలా తీర్పు ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

ALSO READ : కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్..! (ఆడియో)

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తామే తెలంగాణ ఇచ్చామని, సోనియా గాంధీ కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రచారం సాగించారు. అంతేకాకుండా అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు కూడా సోనియా గాంధీ వల్లనే వచ్చాయని కూడా పేర్కొన్నవి. సోనియా గాంధీ కి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని ఈ ఎన్నికల్లో ఆమె రుణం తీసుకోవాలని ఎదురుచూస్తున్నట్లుగా ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాల్లో పేర్కొన్నారు.

అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పడలేదని, తమ మద్దతు ఇవ్వడం వలన తెలంగాణ ఏర్పడిందని ఆ పార్టీ నేతలు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.

ఏది ఏమైనా తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ, తమ మద్దతు వల్లనే తెలంగాణ వచ్చిందని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటుండగా తెలంగాణ పదం ఉన్న పార్టీ పేరులో తెలంగాణ లేకుండా ఈ ఎన్నికల్లో దిగిన బీఆర్ఎస్ కు ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.

ALSO READ : పారిపోయాడంటూ గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు