మిర్యాలగూడ : ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. గెలిచేది అతడేనా..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఫైట్ కొనసాగుతుంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో మూడవసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ప్రయత్నిస్తున్నారు. కాగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో పాటు తనకున్న సామాజిక సేవతో ప్రజలకు దగ్గరైన భక్తుల లక్ష్మారెడ్డి ఈసారి గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారు.

మిర్యాలగూడ : ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. గెలిచేది అతడేనా..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఫైట్ కొనసాగుతుంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో మూడవసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ప్రయత్నిస్తున్నారు. కాగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో పాటు తనకున్న సామాజిక సేవతో ప్రజలకు దగ్గరైన భక్తుల లక్ష్మారెడ్డి ఈసారి గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారు.

నియోజకవర్గంలో మొత్తం 23 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ నోట విన్నా.. వీరిద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వివిధ పార్టీల నుంచి కొంతమంది, స్వతంత్ర అభ్యర్థులుగా మరికొంతమంది పోటీలో ఉన్నారు. వారి వారి ప్రచారాలు సైతం నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో నల్లమోతు భాస్కరరావు – భత్తుల లక్ష్మారెడ్డి మధ్యనే బిగ్ ఫైట్ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వీరిద్దరి మధ్య మరింత పోటీ నెలకొంటుంది.

ALSO READ : పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్.. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం..!

నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బహిరంగ సభ నిర్వహించారు. అదే విధంగా కేటీఆర్ రోడ్ షో, మహిళల ర్యాలీ, నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించి నల్లమోతు భాస్కరరావు తన బలాన్ని నిరూపించుకున్నాడు. కాగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న భత్తుల లక్ష్మారెడ్డి కు మాత్రం నామినేషన్ రోజే భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దాంతో అప్పటికే బత్తుల లక్ష్మారెడ్డి బలం ఏంటో నిరూపణ అయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

2014 ఎన్నికల్లో నల్లమోతు భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి పై విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినప్పటికీ టిఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో మరోసారి గెలుపొందారు. తిరిగి ప్రస్తుతం ఆయనకే టికెట్ ఇవ్వడం వల్ల 2023లో బిఆర్ఎస్ తరఫున పోటీలో నిలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు.

ALSO READ : కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్..! (ఆడియో)

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భత్తుల లక్ష్మారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యాడు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అతను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషిచేసి వార్డు కౌన్సిలర్ గా గెలుపొంది మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్నారు. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. 2023లో తనకు పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల పోటీలో నిల్చున్నాడు.

ఏది ఏమైనప్పటికీ మిర్యాలగూడ పోటీ పార్టీల మధ్యన కాకుండా వ్యక్తిగతంగా కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల శిబిరాల్లో ఉత్కంఠత నెలకొన్నది. ఎవరికివారుగా గెలుపు ధీమాతో ఉన్నారు. ఇరువురి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు తమ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం చేసుకోవడం విశేషం.