Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : విద్యుత్ షాక్ తో పాడి గేదెలు మృతి..!

Miryalaguda : విద్యుత్ షాక్ తో పాడి గేదెలు మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో విద్యుత్ షాక్ తో పాడి గేదెలు మృతి చెందాయి. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో ఆదివారం ఉదయం వ్యవసాయ బావి వద్ద గేదెలకు విద్యుత్ షాక్ తగిలింది. దాంతో ఆ గ్రామానికి చెందిన పరంగి తిరుపతమ్మ, నాలి లక్ష్మయ్య, కడం తీరసుకు చెందిన ఆరు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి.

వాటిలో నాలుగు పాలు ఇచ్చే గేదెలు ఉండగా రెండు దూడలున్నాయి. వాటి విలువ సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని గేదెల యజమానులు చేరుకుంటున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే గేదెలకు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు బాధితులు పేర్కొంటున్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

  2. TG News : తెలంగాణ క్యాబినెట్ లోకి ముగ్గురే.. వారు వేరే..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై క్లిలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త.. వారికి రూ.10 లక్షలు..!

మరిన్ని వార్తలు