Rajanarsimha : 317 జీవోపై సబ్‌కమిటీ చైర్మన్‌గా దామోదర్‌ రాజనర్సింహ

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ట్రెజరీ నుంచి జీతం అందుకుంటున్న సిబ్బంది ఎదుర్కొంటున్న జీవో 317 సమస్యలపై స్టడీ చేసి పరిష్కార మార్గాలను సూచించేలా ప్రభుత్వం శనివారం మంత్రివర్గ ఉప సంఘంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతాకుమారి జీవో (నెం. 292)ను జారీ చేసింది.

Rajanarsimha : 317 జీవోపై సబ్‌కమిటీ చైర్మన్‌గా దామోదర్‌ రాజనర్సింహ

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అందోలు, మన సాక్షిః

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ట్రెజరీ నుంచి జీతం అందుకుంటున్న సిబ్బంది ఎదుర్కొంటున్న జీవో 317 సమస్యలపై స్టడీ చేసి పరిష్కార మార్గాలను సూచించేలా ప్రభుత్వం శనివారం మంత్రివర్గ ఉప సంఘంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతాకుమారి జీవో (నెం. 292)ను జారీ చేసింది.

కమిటీకి చైర్మన్‌గా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహను చైర్మన్‌గా ఈ కమిటీలో మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధరాబాబు, పొన్నం ప్రభాకర్‌ సభ్యులుగా నియమించారు. జీవో 317తో తలెత్తిన సమస్యలు, ఉద్యోగులు– ఉపాధ్యాయుల అభిప్రాయాలు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇకపైన సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు..

ఇలాంటి అనేక అంశాలను స్టడీ చేసి తగిన సిఫారసులతో పాటు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీకి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కన్వీనర్‌ గా వ్యవహరించనున్నారు. ఈ కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి.

జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు

ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.