సూర్యాపేట : డిసిసి అధ్యక్షులుగా చెవిటి వెంకన్న యాదవ్ రెండవసారి నియామకం

సూర్యాపేట : డిసిసి అధ్యక్షులుగా చెవిటి వెంకన్న యాదవ్ రెండవసారి నియామకం
సూర్యాపేట , మనసాక్షి
కాంగ్రెస్ పార్టీ లో కష్టపడే వారికి గుర్తింపునిస్తుందని డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. నా రాజకీయ జీవితం దామోదర్ రెడ్డి సారధ్యంలో పనిచేశానని అన్నారు.ఎన్నో ఒడిదొడుకులు వచ్చిన ఎదుర్కొని నిలదొక్కుకునే క్రమశిక్షణను కాంగ్రెస్ పార్టీ నేర్పించిందని తెలిపారు.
నిత్యం కార్యకర్తలతో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సమస్య పరిష్కార దిశగా పనిచేస్తున్నారు . పార్టీ అభివృద్ధి కి అకుంఠిత దీక్షతో ఎంతో క్రమశిక్షణతో పని చేశాను కాబట్టి రెండోసారి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు కట్టబెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానని అన్నారు.అనంతరం సూర్యాపేట పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘజమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కేక్కిరేణి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల అధ్యక్షుడు బైరు శైలేందర్ గౌడ్,అబ్దుల్ రహీం, నెల్లుట్ల లింగస్వామి, వెంకటరెడ్డి, వెన్న మధుకర్ రెడ్డి ,రెబల్ శ్రీను, పిడమర్తి మల్లయ్య, అన్నమయ్య రాము, కుందమల్ల శేఖర్, నాగుల వాసు, నరేందర్ నాయుడు, సాయి నేత, రాచకొండ జానయ్య తదితరులు పాల్గొన్నారు.