గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

చౌటుప్పల్., .మన సాక్షి.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రం తూప్రాన్ పేట్ గ్రామంలోని మసీదు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంను శనివారం చౌటుప్పల్ పోలీసులు గుర్తించారు.

 

చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ గ్రామంలోని మసీదు వద్ద గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నట్లు సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతి చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 40 నుండి 50 సంవత్సరాలు మధ్య ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి చెత్త ఏరుకొని జీవనం సాగించే వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చెత్త ఏరుకునే క్రమంలో ఫిట్స్ కానీ లేదా ఏదైనా అనారోగ్యానికి గురై కానీ మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నట్లు చౌటుప్పల్ సిఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.

 

మృతి చెందిన వ్యక్తిని గుర్తించిన వారు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. మృతుడు ఎవరనేది తెలియ రాలేదని, మృతదేహాన్ని స్థానిక చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.