BREAKING : మిర్యాలగూడలో తీవ్ర విషాదం.. గూడ్స్ రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య..!
BREAKING : మిర్యాలగూడలో తీవ్ర విషాదం.. గూడ్స్ రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం సమీపంలోని దుర్గా నగర్ గ్రామానికి చెందిన ధనలక్ష్మి, దేవి ప్రసాద్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ధనలక్ష్మికి వివాహం కాగా ఒక బాబు కూడా ఉన్నాడు. వీరిద్దరి వివాహేతర సంబంధం ఇరు కుటుంబాలలో తెలియడంతో వివాదాలు జరుగుతున్నాయి. ఇద్దరిని ఆయా కుటుంబ సభ్యులు మందలించారు. దాంతో వారు మనస్థాపం చెంది మిర్యాలగూడ మండలంలోని ఐలాపురం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో వెంకటాద్రిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువుల రోధనలు మిన్నంటాయి.
ALSO READ :
Miryalaguda : మిర్యాలగూడలో వాట్సప్ స్టేటస్ పెట్టి.. రైలు కింద పడి యువకుడు మృతి..!
మిర్యాలగూడ : వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట ఆందోళన..!
Nalgonda : నల్గొండ జిల్లాలో ముగ్గురు తహసిల్దార్లు, ఒక విఆర్ఓ అరెస్ట్..?









