మిర్యాలగూడ : వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట ఆందోళన..!

మిర్యాలగూడ పట్టణంలోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంతోటే మృతి చెందినాడంటూ మృతుని బంధువులు స్థానికులు పెద్ద ఎత్తున హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

మిర్యాలగూడ : వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట ఆందోళన..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణంలోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంతోటే మృతి చెందినాడంటూ మృతుని బంధువులు స్థానికులు పెద్ద ఎత్తున హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన కొండపల్లి శేఖర్ (30) మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటా హుటిన శేఖర్ ని మిర్యాలగూడ పట్టణంలోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు చికిత్స అందిస్తామంటూ మభ్యపెట్టి, ఫీజు రూపంలో వేలాది రూపాయలు దండుకొని బుధవారం రాత్రి మృతి చెందాడని తెలిపినట్లు వాళ్లు పేర్కొన్నారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శేఖర్ మృతి చెందాడని ఆగ్రహించిన బంధువులు పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న వన్ టౌన్ ఎస్ ఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు నిర్వహించారు. డాక్టర్ పై చర్యలు తీసుకో బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మృతునికి భార్య ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

MOST READ : 

BREAKING : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ క్లినికులపై ఆకస్మిక తనిఖీలు.. 55 మంది ఆర్ఎంపీ, పీఎంపీలపై కేసులు..!

Miryalaguda : మిర్యాలగూడలో వాట్సప్ స్టేటస్ పెట్టి.. రైలు కింద పడి యువకుడు మృతి..!

BREAKING : నల్గొండ డిటిసి ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. ఏజెంట్ల ద్వారా పనులు చేయీస్తున్న అధికారులు..!