Miryalaguda : మిర్యాలగూడలో వాట్సప్ స్టేటస్ పెట్టి.. రైలు కింద పడి యువకుడు మృతి..!

రైలు కింద పడి యువ కుడు మృతిచెందిన సంఘటన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం సీతారాంపురంకు చెందిన తన్నీరు సాయికిరణ్ (24) స్థానికంగా ఓ ప్రైవేట్ సంస్థలో డెలివరి బాయ్ గా పనిచేస్తున్నాడు.

Miryalaguda : మిర్యాలగూడలో వాట్సప్ స్టేటస్ పెట్టి.. రైలు కింద పడి యువకుడు మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

రైలు కింద పడి యువ కుడు మృతిచెందిన సంఘటన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం సీతారాంపురంకు చెందిన తన్నీరు సాయికిరణ్ (24) స్థానికంగా ఓ ప్రైవేట్ సంస్థలో డెలివరి బాయ్ గా పనిచేస్తున్నాడు.

సీతారాంపురంకు చెందిన ఓ మైనర్ బాలికను సాయికిరణ్ 2020 నుంచి వేధిస్తున్నాడు. అయితే 2022లో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఈనెల 28న రాత్రి సదరు బాలిక ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. దీనిపై బాలిక తల్లి బుధవారం ఉదయం టుటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

దీంతో టూటౌన్ సీఐ నాగార్జున సాయికిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదైన సమాచారం తెలుసుకున్న సాయికిరణ్ రైల్వేట్రాక్ పైకి వెళ్లి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు స్నేహితులకు వాట్సాప్ స్టేటస్ సమాచారం పెట్టాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో రైల్వే ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు.

వేదింపులతో నా కుమారుడు మృతి: తల్లి వెంకటమ్మ

తన కుమారుడి మృతికి సోమగాని శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్ లు ఇద్దరు కారణమని వారు ఎమ్మెల్యే అండ చూసుకోని తన కుమారుడిపై వేదింపులకు పాల్పడ్డారని మృతుడి తల్లి వెంకటమ్మ ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.