MallaReddy : ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొన్నంతో మల్లారెడ్డి భేటీ.. రేపు రేవంతు..?
MallaReddy : ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొన్నంతో మల్లారెడ్డి భేటీ.. రేపు రేవంతు..?
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదివారం ప్రగతి భవన్ లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో కలిసి వారిని కలిశారు.
మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఉన్న నేపథ్యంలో వీరు ఇరువురు వారిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజశేఖర్ రెడ్డి దంపతులతో పాటు మల్లారెడ్డి కలిసి వివాహానికి ఆహ్వానించారు.
కేటీఆర్, హరీష్ రావుకు సైతం వివాహ ఆహ్వాన పత్రికలను అందజేశారు. కాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కూడా రేపు కలిసి ఆహ్వాన పత్రిక అందజేస్తారని ప్రచారం సాగుతుంది.
మా పుత్రిక శ్రేయరెడ్డి వివాహం సందర్భంగా @chmallareddyMLA గారితో కలసి ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారికి వివాహ ఆహ్వానపత్రిక అందచేసి ఆహ్వానించాను. pic.twitter.com/AfJr63c8ye
— Marri Rajasekhar Reddy (@MarriRajasekar) October 6, 2024
MOST READ :
-
Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..!
-
BIG BREAKING : చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. నల్గొండలో బోల్తా..!
-
Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం, డబ్బులు పడేది అప్పుడే..!
-
PONGULETI : దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా, త్వరలో నూతన రెవెన్యూ చట్టం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!









