Devarakonda : రైతులను హరిగోస పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..!
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యానాయక్ అన్నారు.

Devarakonda : రైతులను హరిగోస పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..!
చింతపల్లి, మనసాక్షి :
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యానాయక్ అన్నారు. శుక్రవారం
పీఏ పల్లి మండలం అంగడి పేట గేట్ హైవే పై రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదేశానుసారం వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి ధర్న చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల విషయంలో శాపంగా మారిందని ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు కోనె దిక్కు ఎండలకు హరి గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం వ్యక్తపరిచారు.రోజుల తరబడి వేచిచూసిన గాని కాంట వేసి లారిలల్లొ మిల్లులకు తరలించే వారు లేరని రోజుల పాటు వడ్ల కుప్పల దగ్గర కాపల వుండాల్సి వస్థుందని .మరోపక్క కట్ షిట్ లేకుండా తాలు పేరిటి మిల్లర్ లతో కుమ్మకై నిలువు దోపిడి చేస్థున్నారు అని అన్నారు.
కేసిఆర్ హాయం లో రైతు ఆనందంగా వున్నారని మళ్లీ కేసిఆర్ రాక కోసం రైతులు ఎదురు చూస్తున్నా రని రైతు ఎడ్చిన రాజ్యం బాగుపడి నట్లు చరిత్ర లో లేదని మళ్ళి పోరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన అండగా వుంటుందని . వడ్లు కొనుగోలు చేసి లారిల కొరత తీర్చాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. కేసిఆర్ రైతు బంధు, రైతు బీమా తో రైతులను ఆదుకున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవరకొండ నియెజక వర్గ సభ్యులు కేతావత్ భిల్యా నాయక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వల్లపు రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సరిత నర్సింహ, గుడిపల్లి సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ముత్యం రావు, తోట కూరి పరమేష్, మండల కార్యదర్శి మారుపాక జగన్, ఎర్ర యాదగిరి, చిలక మర్రి సర్పంచ్ దూదిపాల రాజెందర్ రెడ్డి, వడ్డి పట్ల సర్పంచ్ శ్రీను, సర్పంచ్ కిషన్ నాయక్, సర్పంచ్ ఆడేపు నాగేష్, మునగాల అంజి రెడ్డి, బోడ్డుపల్లి మహెందర్, కర్నాటి రవి, రమావత్ శ్రీను, హరి నాయక్, జైపాల్ నాయక్, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










