సంపద వనం పనులపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువ ఇరిగేషన్ భూముల్లో మూడు చోట్ల ఏర్పాటుచేసిన సంపద వనాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంపద వనం పనులపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు

మునగాల మనసాక్షి :
సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువ ఇరిగేషన్ భూముల్లో మూడు చోట్ల ఏర్పాటుచేసిన సంపద వనాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంపద వనాల్లో మొక్కలను నాటకపోవడాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎంపీడీవో వెంకటేశ్వర్లు ను కారణాలు అడిగి తెలుసుకున్నారు.

సంపద వనాల ప్రక్కనే నీటి సౌకర్యం ఉన్న మొక్కలు నాటకపోవడం పట్ల కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా విధులకు గైరుహాజరైన ఏపీఓ పై తగు చర్యలు తీసూకొవాలని కలెక్టర్ అన్నారు.

ALSO READ : Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!

గట్టు చుట్టూ ఉన్న భూమికి ఫెన్సింగ్ వేసి, మొక్కలు నాటక పోవడానికి గల కారణాలను ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు. వారంలోపు మూడు ప్రాంతాలలో మొక్కలు నాటాలని సూచించారు .

ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీష్ కుమార్, ఎమ్మార్వో ఆంజనేయులు, సర్పంచ్ లు సిహెచ్ ఉపేందర్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రటరీలు శ్వేత, అనిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాధారెడ్డి, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

ALDO READ : Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!