District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..!
రెవిన్యూ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి (సాగర్) మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..!
మనసాక్షి, తిరుమలగిరి (సాగర్) :
రెవిన్యూ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి (సాగర్) మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భూమి రికార్డులు, పహాణీలు, ఆర్‌ఓఆర్ ఫైళ్లు, మ్యూటేషన్ దరఖాస్తులు, ధరణి భూభారతి నమోదు వివరాలను ఆయన పరిశీలించారు.తనిఖీ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రికార్డుల నిర్వహణ పద్ధతి పై సూచనలు చేస్తూ, డిజిటల్ నమోదులను సకాలంలో అప్డేట్ చేయాలని తెలిపారు. రెవెన్యూ సేవలు పారదర్శకంగా, వేగవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కార స్థితిని కలెక్టర్ పరిశీలించారు.
ప్రజలు కార్యాలయానికి వచ్చినప్పుడు సమయానికి సేవలు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఉన్నారు.
MOST READ :
- District collector : కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రా..!
- Rythu Bharosa : రైతు భరోసా ఇచ్చేది ఎప్పుడు.. కీలక అప్డేట్..!
- PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. చెల్లింపులు మరింత ఈజీ.. లేటెస్ట్ అప్డేట్..!
- Miryalaguda : పూజలు, మంత్రాల పేరుతో ఘరానా మోసం.. ఆమాయక ప్రజలే టార్గెట్..!