Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కీలక ఆదేశాలు.. ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..!

District collector : జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కీలక ఆదేశాలు.. ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

వర్షాలకు పాడైన రోడ్లు వెంటనే మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసి న వర్షాలకు దెబ్బ తిన్న ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ కు సంబంధించిన బీటీ, మట్టి రోడ్లను మంగళ వారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డిఓ ఆఫీస్, పాత బస్టాండ్ మీదుగా పళ్ళా బ్రిడ్జ్, ఎంబీ చర్చి ఆర్ అండ్ బీ రోడ్డు ను చూశారు.

అటు నుంచి ఎక్లాస్ పూర్ మార్గంలోని లోకపల్లి లక్ష్మమ్మ గుడికి వెళ్ళే మట్టి రోడ్డును పరిశీలించారు. ఇటివలే లోకపల్లి లక్ష్మమ్మ జాతరకు ముందు ఆ రహదారిని మట్టి వేసి చదును చేయగా వారం క్రితం కురిసిన వర్షాలకు ఆ మట్టి రహదారి కొంచెం దెబ్బ తిన్నదని, పై నుంచి వచ్చే వాన నీరు రహదారి పైకి చేరకుండా చిన్న కల్వర్టు మాదిరిగా పైపులు వేయాలంటే రహదారి పక్కన ఉన్న వెంచర్ యజమాని నిరాకరి స్తున్నాడని పీఆర్ ఈ ఈ హీర్యా నాయక్ కలెక్టర్ కు తెలిపారు.

స్పందించిన కలె క్టర్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. జాతరకు ఎంత మంది భక్తు లు వస్తారని ప్రశ్నించగా దాదాపు 50 నుంచి 60 వేల మంది వస్తారని లోకపల్లి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇటీవలే జాతర జరిగిందని వారు చెప్పారు. అనంతరం కలెక్టర్ ఊట్కూరు మండలం వల్లంపల్లి గ్రామానికి వెళ్లే మట్టి రహదారిని పరిశీలించారు.

వర్షం వస్తే ఆ రహదారి చిత్త డిగా మారుతుందని, తాత్కా లిక మరమ్మతు పనులు చేస్తామని పంచాయతీ రాజ్ అధికారులు తెలపగా, ఇంత కు ముందు ఆ రహదారి మర మ్మతులకు ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి? ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అనే వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. చివరగా పట్టణంలోని యాదగిరి రోడ్డు మార్గంలో గల కొత్త కాలనీ కి వెళ్ళే దారిలో ఉన్న లోలెవల్ కల్వర్టును కలెక్టర్ పరిశీలిం చారు.

ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాన నీరు కల్వర్టుపైకి చేరి రాకపోకలు నిలిచి పోయా యని, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి చొరవతో అవతలి వైపు నుంచి తాత్కా లిక దారిని ఏర్పాటు చేయ డం జరిగిందని ఆ కాలనీ వాసులు కలెక్టర్ కు తెలిపా రు. అయితే కల్వర్టు కింద నుంచి వాన నీరు ముందుకు పోకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు, ముళ్ళ పొదలు ఉన్నాయని వాటిని తొలగింపజేయాలని కలెక్టర్ మున్సిపల్ అధికా రులను ఆదేశించారు.

కల్వర్టు ఎత్తు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదిస్తామని కాలనీ వాసులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు. అనంతరం కలె క్టరేట్ లోని తన ఛాంబర్ ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారు లతో విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై కలెక్టర్ చర్చించారు.

విపత్తు నిర్వహ ణ నిధులకు సంబంధించి రోడ్లు, కల్వర్టులు, తెగిన చెరు వులు, కుంటల మరమ్మ తులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ.ఈ. వెంకటర మణ, డీ ఈ రాములు, నీటిపారుదల శాఖ ఈ ఈ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, పి.ఆర్. ఆర్ అండ్ బి ఏ ఈ లు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త..!

  2. High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!

  3. TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

  4. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు..!

  5. Nalgonda : రైతుల ఘోస.. యూరియా కోసం తెల్లవారుజామునుంచే భారీ క్యూ..!

  6. Elections : స్థానిక ఎన్నికలు.. పల్లెల్లో ఆశావహుల సందడి..!

మరిన్ని వార్తలు