Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా
District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి..!
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యాధికారులు పనిచేయాలని, అప్పుడే పేదవారికి ఆరోగ్య భద్రత చేకూరుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి..!
వెల్దండ, మన సాక్షి:
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యాధికారులు పనిచేయాలని, అప్పుడే పేదవారికి ఆరోగ్య భద్రత చేకూరుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులతో పాటు రికార్డులను పరిశీలించారు.
అందుతున్న వైద్యం వివరాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం..పాత ఆస్పత్రి భవనంలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఉప వైద్యాధికారి భీమా నాయక్, తహసిల్దార్ కార్తీక్ కుమార్, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, వైద్య సిబ్బంది సూర్య కళ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!
-
Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!









