District collector : ప్రభుత్వ పాఠశాలలో దగ్గరుండి మెనూ పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
District collector : ప్రభుత్వ పాఠశాలలో దగ్గరుండి మెనూ పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
కరీంనగర్, మనసాక్షి :
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ కచ్చితంగా పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం చింతకుంట పరిధి శాంతినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.
తరగతి గదులు తిరుగుతూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్నం భోజనం, బోధన మెటీరియల్, రీడింగ్ కార్నర్ ను పరిశీలించారు. పాఠశాలలో టీవీ పని చేస్తుందా.. ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదనపు తరగతి గదుల కోసం భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వారి వెంట ఎంఈఓ ఆనందం, హెచ్ఎం గౌస్ ఖాన్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!
-
District collector : నానో యూరియా తో అధిక దిగుబడి.. రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Karimnagar : లీజు రద్దు చేయాలి.. దేవాలయ భూములను కాకాపాడాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!
-
Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!
-
TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!









