Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ తొలి సంతకం.. దేనికోసం అంటే..!

District collector : జిల్లా కలెక్టర్ తొలి సంతకం.. దేనికోసం అంటే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

జిల్లాలోని బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నారు.

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ- జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్ లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్ఫూర్తిదాయక అభిప్రాయంతో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వర్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, ఎస్. డీ.సీ రాజేందర్ గౌడ్, మిషన్ భగీరథ ఈ ఈ రంగారావు, డీ పీ ఆర్ వో ఎం.ఏ. రషీద్, డిసిపివో కరిష్మా , చైల్డ్ హెల్ప్ లైన్ సమన్వకర్త నర్సింహులు, జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, సఖి సిబ్బంది ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ : 

  1. ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!

  2. Miryalaguda : మంత్రులకు ఘన స్వాగతం.. భారీ ర్యాలీతో దద్దరిల్లిన మిర్యాలగూడ..!

  3. Bus Fire : మరో బస్సు దగ్ధం.. 42 మంది సజీవ దహనం..!

  4. Rythu : ఇదేం కండిషన్ మేడమ్.. డిఏపి కావాలంటే అవి తప్పనిసరిగా కొనాల్సిందే..!

మరిన్ని వార్తలు