District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!
District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!
కొల్చారం, మన సాక్షి ;
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కలెక్టర్ కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.
దవాఖానలో సిబ్బంది స్టాక్ రిజిస్టర్, మందులు నిల్వల రిజిస్టర్, ఓ.పి రిజిస్టర్ను పరిశీలించి. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత, సాధారణ ప్రసవాలు , ఆరోగ్య మహిళా కార్యక్రమం,గురించి ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా డెలివరీల సంఖ్యను పెంచాలన్నారు.
రిస్క్ ఉన్న కేసులను జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి లకు పంపాలని చెప్పారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా గుర్తించిన అనుమానిత క్యాన్సర్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వారిని జిల్లా ఆసుపత్రి కి రిఫరల్ చేస్తూ ఖచ్చితంగా పరీక్షలు చేసుకునేలా మానిటర్ చేయాలన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమం తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో చేపట్టాలన్నారు.
జ్వర బాధితులకు టెస్ట్ ల సంఖ్యను పెంచాలన్నారు.డెంగ్యూ , మలేరియా, టైఫాయిడ్ కేసుల ను పూర్తిగా అరికట్టేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. హై రిస్క్ ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు డ్రైడేను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు ప్రధానంగా నీటి నిల్వ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. రైతు నేస్తం వీక్షించాలి..!
-
Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!
-
District Collector : ఈవీఎంలు భద్రత.. గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్..!
-
Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!









