క్రైంBreaking Newsనారాయణపేట జిల్లా

District SP : ప్రజల భద్రతపై భరోసా కల్పించాలి.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

District SP : ప్రజల భద్రతపై భరోసా కల్పించాలి.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా పరిధిలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజల భద్రతపై భరోసా కల్పిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరిగతంగా పరిష్కరించాలన్నారు.

పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు.

కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు.

దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు ఎస్సైలు లు, హెడ్ కానిస్టేబుల్ లకు కూడా ఇన్వెస్టిగేషన్ చేసేలా కేసులు అప్పగించాలని తెలిపారు. పోలీసు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కో వాలన్నారు.

కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ నూతన సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం పిడిఎస్ బియ్యం రవాణా, లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

రిపీటెడ్ గా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ ను నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎస్పీ లింగయ్య, సిఐ లు శివ శంకర్, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్, సైదులు, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, రాజు, విజయ్, రమేష్, రాము, భాగ్యలక్ష్మి రెడ్డి, నవీద్, కృష్ణం రాజు, సునిత, తది తరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : మఖాన సాగు పై రైతులు దృష్టి సారించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

  2. Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!

  3. TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!

  4. Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు