మునగాల : డివైడర్ ను ఢీ కొట్టిన కారు

డివైడర్ ను ఢీ కొట్టిన కారు
మునగాల , మనసాక్షి
కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడిన ఘటన మండల పరిధిలోని మాధవరం గ్రామంలో చోటుచేసుకుంది.
మాధవరం గ్రామంలో జాతీయ రహదారి 65పై విజయవాడ నుండి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు డివైడర్ ను ఢీ కొని పల్టీ కొట్టింది.
Also Read :Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!
రోడ్డు పై ముందు వెళ్తున్న బైక్ ను ఢీ కొనడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పెన్ పహాడ్ మండలం మాహమ్మదాపురం గ్రామ వాసులుగా గ్రామస్తులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.