జిమ్ లో ఇలా చేస్తావా..? వైరల్ అవుతున్న వీడియో.. తీవ్ర విమర్శలు..!
జిమ్ లో ఇలా చేస్తావా..? వైరల్ అవుతున్న వీడియో.. తీవ్ర విమర్శలు..!
మన సాక్షి :
సోషల్ మీడియాలో ఓ జిమ్ లో ఫిట్నెస్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అది ఏంటంటే.. ఫిట్నెస్ సెంటర్లో కోచ్ ఓ యువతి తో ప్రవర్తించిన తీరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు తెలుస్తోంది. ఎక్స్ లో మొదట షేర్ చేయబడిన వీడియో ట్రైనర్ సహాయపడే నెపంతో వ్యాయామాలకు వెళ్లే మహిళల పట్ల అనుచితంగా తాకినట్లు చూపిస్తుంది.
కృష్ణ నగర్ కు చెందిన జిమ్ సెంటర్లో వెలువడిన ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారడంతో కోచ్ తీరు పట్ల నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫిట్నెస్ సెంటర్లలో మహిళలకు భద్రతకు ఆందోళన కలిగించేలా ఉన్న ఈ వీడియో ఇలాంటి జిమ్ సంస్థల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
https://twitter.com/ManojSh28986262/status/1858410375672205612?t=67-N-A4rlAXg-eHz27OEgw&s=19









