Breaking Newsజాతీయం

Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!

Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!

నల్లగొండ, మన సాక్షి :

ఆహార భద్రతలో భాగంగా దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతినెల 5 కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. గురువారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మహా విపత్తులో ఏ ఒక్కరూ ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆహార భద్రత కింద పేదలందరికి 5 కిలోల చొప్పున 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని ,ఇది 2030 వరకు ఇది కొనసాగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ప్రతినెల 5 కిలోల బియ్యం ఇవ్వటం లేదని అన్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ యూరోపియన్ దేశాలలో సైతం ఇలాంటి పద్ధతి లేదని, భారత ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయని, ప్రపంచంలోనే భారత ఆహార భద్రత పథకం మోడల్ గా తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు.

ప్రపంచ బ్యాంకు సైతం ఇటీవల నివేదికలో భారత దేశంలో అత్యంత ఎక్కువ మందికి ఆహార భద్రత కింద ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్న విషయాన్ని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఆహార భద్రత వ్యవస్థను పటిష్టం చేసేందుకు రేషన్ కార్డులన్నిటిని డిజిటలైట్ చేయడం జరిగిందని తెలిపారు.

MOST READ :

  1. Miryalaguda : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. నకిలీ బంగారం విక్రయిస్తున్న లీడర్ అరెస్ట్..!

  2. Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

  3. Penpahad : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఏం చెప్పారంటే..!

  4. Rythu : ఇదేం కండిషన్ మేడమ్.. డిఏపి కావాలంటే అవి తప్పనిసరిగా కొనాల్సిందే..!

  5. ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!

మరిన్ని వార్తలు