తెలంగాణBreaking Newsక్రైంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : జిల్లా కలెక్టర్ చే మెడల్ అందుకున్న డాగ్.. ఎందుకో తెలుసా..! 

District collector : జిల్లా కలెక్టర్ చే మెడల్ అందుకున్న డాగ్.. ఎందుకో తెలుసా..! 

జగిత్యాల, (మన సాక్షి) :

పోలీస్ జగిలాలు నేర పరిశోధన, భద్రతా చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ, మరియు విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిని,శిక్షణా సామర్థ్యం వల్ల పోలీసులు విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నారని జిల్లా కలెక్టర్ సత్య
ప్రసాద్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానం దగ్గర పోలీస్ జగిలాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తో కలిసి కలెక్టర్ సత్య ప్రసాద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ పోలీస్ జాగిలాలకు ఇంతకు ముందు ఎస్ ఆర్ ఎస్ పి క్వార్టర్స్ లో ఉండేది అక్కడ సరైన వసతులు లేవని జిల్లా ఎస్పీ మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగిందని వీటికి శాశ్వతంగా గదులను కేటాయించాలని ఉద్దేశంతో వీటిని  ప్రారంభించడం జరిగింది అని అన్నారు.

జాగిలాలు నేరాల నిరోధం, విచారణ, భద్రతాపరమైన చర్యల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటి అధిక సామర్థ్యం, విశ్వసనీయత మరియు ప్రత్యేక శిక్షణ కారణంగా పోలీస్ వారికి ఎంతగానో సహాయ పడతాయి అని తెలిపారు.

ఈ సందర్భం ఎస్పీ మాట్లాడుతూ విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయిని హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయిని అన్నారు.

మాదకద్రవ్యాలు, బాంబులు మరియు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయిని జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనది అని అన్నారు.

పోలీస్ జగిలాలకు అధునాతన శిక్షణ, వైద్య సంరక్షణ, తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆరు జగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల కోసం గదులను ఏర్పాటుకు సహాయం చేసిన జిల్లా కలెక్టర్ కి ఎస్పీ  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్ ను సాధించిన డాగ్ ను కలెక్టర్  ప్రత్యేకంగా అభినందించి మెడల్ ను ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బీమ్ రావు,డిఎస్పి లు రఘు చంధర్, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు,  టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, డిసిఆర్బి,ఏస్ బి,ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ఆరిఫ్ అలీ ఖాన్, శ్రీధర్, మరియు ఆర్ ఎస్ ఐ లు, డాగ్స్ హాండ్లర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

  2. District collector : జిల్లా కలెక్టర్ షాక్.. ఆ పీహెచ్సీ కి వెళ్తే అందరూ ఆబ్సెంటే..!

  3. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  4. Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

  5. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు