మిర్యాలగూడ: తాగునీటి సమస్య పరిష్కరించాలని మున్సిపాలిటీ వద్ద ధర్నా

మిర్యాలగూడ: తాగునీటి సమస్య పరిష్కరించాలని మున్సిపాలిటీ వద్ద ధర్నా
మిర్యాలగూడ టౌన్ మన సాక్షి:
ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పాలకులు పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణంలోని ఈదులగూడెం ఏమే కాలనీ ప్రజలు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈదులగూడెం ఎనే ప్రాంతంలో 350 కుటుంబలు పైగా నివసిస్తున్నాయని కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని కనీసం నడవలేని పరిస్థితి ఉందని వాపోయారు డ్రైనేజీ లేక మురుగునీరు అంతా రోడ్డుపై వచ్చి చేరుతుందని దాని ఫలితంగా దోమలు పందులు సైర్వ్యహారం చేస్తున్నాయని చెప్పారు.
కాలనీ ప్రజలకు మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి నల్లాలు బిగించారని కానీ మంచినీరు ఇప్పటివరకు రాలేదని తెలిపారు. మంచినీరు లేక బోరు నీటితో దాహార్తి తీసుకుంటున్నారని చెప్పారు. ఎంతోమంది నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారని వారికి రేషన్ కార్డులు, పింఛను అందడం లేదన్నారు. ఆ కాలనీ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత వేసవి కాలంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మంచినీరు అందగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, పాలకులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరువధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీష్ చంద్ర, రవి నాయక్,
డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రెమిడాల పరశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, భావండ్ల పాండు, కౌన్సిలర్ ఎంఏ గని, నాయకులు దేశి రామ్ నాయక్, కోడి రెక్క మల్లయ్య, గాయం వెంకటరమణారెడ్డి, నిరంజన్, రామారావు, బి ఎం నాయుడు, పాపారావు, ఊర్మిళ, ఫాతిమా, మున్నీ, వాడపల్లి రమేష్, లక్ష్మీనారాయణ, లెంకల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.