Miryalaguda : మూసి ఎడమ కాలువ పరిధిలో ఎండిపోతున్న పంట పొలాలు.. పరిశీలించిన సీపీఎం బృందం..!
Miryalaguda : మూసి ఎడమ కాలువ పరిధిలో ఎండిపోతున్న పంట పొలాలు.. పరిశీలించిన సీపీఎం బృందం..!
వేములపల్లి, మన సాక్షి :
మూసీ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు పరిధిలో పంటలు ఎండుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆమనగల్లు, లక్ష్మీదేవిగూడెం, రావువారి గూడెం ఏరియాలలో పంటలు ఎండిపోతున్నాయి.
కాగా ఎండిపోయిన పంటల రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర మండల కార్యదర్శి పాదూరు శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని ఆమనగల్లు, రావువారిగూడెం, లక్ష్మీదేవిగూడెం గ్రామాలలో ఎండిపోతున్న పంట పొలాలను రైతులు, సీపీఎం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు క్రింద మాడ్గులపల్లి, వేములపల్లి, తిప్పర్తి మండలాల రైతులు ఎకరాకు 30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి వారి పంట వేశారన్నారు.ప్రాజెక్టులో నీరు ఉండడం వలన నీరు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని నమ్మకంతో పంటను వేశారన్నారు.
రైతులు అప్పులు తీసుకొచ్చి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చివరి దశలో ఎండిపోతున్న కూడా అధికారులు పట్టించుకోకపోవడం చాలా అన్యాయం అన్నారు.ప్రాజెక్టు పైన అజమాయిషీ లేకపోవడం వలన నీళ్ళు ఉన్నా కోసం చివరి రైతాంగానికి నీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ఇరిగేషన్ అధికారులు స్పందించి నీటిని అందించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి కనీసం 20 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.పంటల భీమా పథకం అమలు చేసి బ్యాంక్ రుణాలను వెంటనే మాఫీ చేయాలన్నారు.
ఇది రైతు ప్రభుత్వం అన్ని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులను పట్టించుకోక పోవడం చాలా అన్యాయం అన్నారు.వెంటనే మూసీ ప్రాజెక్టు క్రింద ఉన్న పంట పొలాలను ప్రభుత్వం మరియు ఇరిగేషన్ అధికారులు పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వేములపల్లి మాజీ వైస్ ఎంపీపీ పాదూరు గోవర్దన, జిల్లా కమిటీ సభ్యులు రొండి శ్రీనివాస్ మండల నాయకులు పతాని శ్రీను,తంగెళ్ళ నాగమణి,అయితగాని విష్ణు, చింతచెర్ల శ్రీను, పిండి వెంకట్ రెడ్డి, సబ్బు రవీందర్ రెడ్డి,అల్గుబెల్లి వెంకట్ రెడ్డి,రైతులు చింతకాయల గంగయ్య, రావు వెంకట్ రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Flash.. Flash.. కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. రెండు ప్రైవేటు బస్సులు ఢీ..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !
-
Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!









