మిర్యాలగూడ : ఈపాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలి

షాపుల యాజమాన్యం రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలని ఏడిఏ పోరెడ్డి నాగమణి ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని వెంకటరమణ ఫర్టిలైజర్ ఏజెన్సీ, మార్కెఫ్డ్, మిర్యాలగూడ, విశ్వామిత్ర ఆగ్రో కెమికల్స్,మిర్యాలగూడ మరియు ఎం.బి అక్కయ్య షాప్ లను ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు.

మిర్యాలగూడ : ఈపాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలి

రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలి

ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన మిర్యాలగూడ ఏడిఏ
పి.నాగమణి

మిర్యాలగూడ, మన సాక్షి:

షాపుల యాజమాన్యం రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలని ఏడిఏ పోరెడ్డి నాగమణి ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని వెంకటరమణ ఫర్టిలైజర్ ఏజెన్సీ, మార్కెఫ్డ్, మిర్యాలగూడ, విశ్వామిత్ర ఆగ్రో కెమికల్స్,మిర్యాలగూడ మరియు ఎం.బి అక్కయ్య షాప్ లను ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు.

ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ యాప్ లో భాగంగా రికార్డులను పరిశీలించి నివేదికను ఆన్లైన్లో సమర్పిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ కమిషనర్ లాగిన్ లో ఈ యాప్ ను పొందుపరిచారని వారంలో రెండు రోజులపాటు ఆరు షాపులను సందర్శించి రికార్డులలో పరిశీలించి వాటి వివరాలను యాప్ లో నమోదు చేయాలని సూచించారని తెలిపారు.

ALSO READ :Runa mafi : రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్..!

అందులో భాగంగానే రికార్డులు పరిశీలించినట్లు తెలిపారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఏరోజుకారోజు స్టాకు వివరాలను రికార్డులో నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారుల నిర్వహణలో అలసత్యం వహించవద్దని కోరారు. ఈపాస్ ద్వారానే ఎరువులు యూరియా విక్రయించాలని సూచించారు.

అమ్మకాలను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజవర్గంలో లక్ష పదివేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని, ఈ సీజన్లో సుమారు 70 వేల ఎకరాలలో పంట సాగు చేశారని తెలిపారు. ప్రస్తుతం వాతావరణంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల అగ్గి తెగుళ్లు పంటలకు సోకుతున్నాయని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకొని తెగుళ్లు నివారించుకోవాలన్నారు.

పంటకు అవసరమైన పోషకాలు అందే విధంగా మందులను పిచికారి చేయాలన్నారు. ప్రస్తుతం 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఆమె వెంట శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.