Ed Office : ఈ డి ఆఫీస్ కు కేటీఆర్..!
Ed Office : ఈ డి ఆఫీస్ కు కేటీఆర్..!
మన సాక్షి :
దేశంలో సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ కేసు కుంభకోణ కోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు చాలామందిని అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే. కవితకు ఈ నెల 23వ తేదీ వరకు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ఇదే కేసులో కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ కూడా ఈ డి అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. కవిత భర్తతోపాటు కవిత కార్యాలయంలో పిఆర్ఓ గా పని చేస్తున్న రాజేష్ మరో ముగ్గురికి ఈ నోటీసులు కూడా అందాయి. ఈ ఐదుగురు సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కొద్దిసేపటి క్రితమే ఈడి కార్యాలయానికి వెళ్లారు. కస్టడీలో ఉన్న కవితను కలుసుకోవడానికి వచ్చారు. అనిల్ కుమార్ తో పాటు కేటీఆర్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ ఈడీ కార్యాలయం మాత్రం కేటీఆర్ ఒక్కడే వచ్చారు. ఈడీ కార్యాలయంలో ఈరోజు కవిత విచారణ అనంతరం కేటీ ఆర్ ఆమెతో మాట్లాడి వెళ్లినట్లు తెలుస్తోంది. న్యాయపరంగా వెళ్దామని కవితకు ధైర్యం చెప్పినట్లు సమాచారం.
RELATED NEWS :
Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టులు ఎన్నో తెలిస్తే షాక్..!
BIG BREAKING : మాజీ మంత్రి కేటీఆర్ కు ఇడి అధికారులు షాక్..!
BIG BREAKING : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె ఇంటి వద్ద హై టెన్షన్..!
BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు జలక్.. ఎన్నికల ముందు ఆమె ఇంట్లో ఈడీ సోదాలు..!









