Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

BIG BREAKING : మాజీ మంత్రి కేటీఆర్ కు ఇడి అధికారులు షాక్..!

BIG BREAKING : మాజీ మంత్రి కేటీఆర్ కు ఇడి అధికారులు షాక్..!

హైదరాబాద్ మన సాక్షి :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడి అధికారులు షాక్ ఇచ్చారు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈడి అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే విషయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం.

అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చారని కవితని అరెస్టు చేయకుండా తమని అడ్డుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. సుమారు 20 మందితో లోపలికి ప్రవేశించి తమపై దౌర్జన్యానికి దిగినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.

ఎలా అరెస్ట్ చేస్తారు. ఈడి అధికారులపై కేటీఆర్ సీరియస్ :

ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు అరెస్టు చేయడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ ఈడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు కవితని ఎలా రెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ప్రొసీజర్ ప్రకారంగానే అరెస్ట్ చేశామని ఇడి అధికారులు తెలుపగా అరెస్ట్ వారెంట్ లేకుండా కవితని ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని కేటీఆర్ నిలదీశారు . తమ న్యాయవాదిని ఎందుకు లోపలికి అనుమతించలేదని ఫైర్ అయ్యారు.

KTR TWEET

 

మరిన్ని వార్తలు