క్రైంBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!

Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!

అనంతగిరి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. అనంతగిరి మండల పరిధిలోని ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి (40) శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఇంటి పక్కన మహిళలు పరిగెత్తుకుని రావడంతో నిందితుడు పరారయ్యాడు.

విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించి సదరు బాలిక సోదరి పిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  2. Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!

మరిన్ని వార్తలు