ఎన్నికల కోసమే కేసిఆర్ పథకాలు

ఎన్నికల కోసమే కేసిఆర్ పథకాలు

నేలకొండపల్లి , మన సాక్షి.

నెలకొండపల్లి నాలుగేళ్లలో చేయలేనిది మూడు నెలలు చేస్తాడా డిసిసి అధ్యక్షుడు దుర్గాప్రసాద్ రాయల్ నాగేశ్వరావు ఎన్నికలు సమీపిస్తున్నాడంతో కెసిఆర్ కు పథకాలు గుర్తుకొస్తున్నాయని డిసిసి అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్, టీపీసీసీ సభ్యులు రాయల్ నాగేశ్వరరావు లు పేర్కొన్నారు.

 

మండలంలోని మంగాపురం తండాలో పల్లె నిద్రలో అనంతరం గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కెసిఆర్ నాలుగేళ్లలో చేయలేని అభివృద్ధి మిగిలిన మూడు నెలల్లో ఎలా చేస్తారని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆరోపించారు.

 

కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదని అన్నారు. గృహ లక్ష్మీ పథకంతో ప్రజలను మరో మారు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కెసిఆర్ జిమ్మిక్కులను ప్రజలు పసిగట్టాలని అన్నారు . అన్ని వర్గాల ప్రజలు పాలనపై విసుకు చెందారని అన్నారు.

 

ALSO READ :

  1. Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!
  2. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
  3. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  4. మన ఊరు మన వాడ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ రక్షణ సమితి
  5. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!

 

రానున్న ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పల్లెల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాగా ఉన్నట్లు ఆరోపించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్నా దేవాలయం భూములపై పూర్తి హక్కు కల్పించి వారికి అన్ని పథకాలు వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇటీవల నేలకొండపల్లిలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఓ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన వ్యక్తులకు పార్టీకి సంబంధం లేదని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్ ,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు మల్లయ్య ,సర్పంచ్ రాయపూడి నవీన్, నాయకులు బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజని, ఎడవల్లి నాగరాజు ,చీనా నాయక్ ,రాధా కృష్ణమూర్తి, జర్రిపోతుల సత్యనారాయణ ,రేగురి హనుమంతరావు , దోసపాటి శేఖర్,  ధనావత్ హరి , సంతోష్ కమల్  పాల్గొన్నారు.