సూర్యాపేట : ఉద్యోగులపై ఉక్కు పాదం మోపిన ఘనత కెసిఆర్ ది –  ఈటెల రాజేందర్

ఉద్యోగులపై ఉక్కు పాదం మోపిన ఘనత కెసిఆర్ ది –  ఈటెల రాజేందర్

అనంతగిరి, మన సాక్షి

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలారం గ్రామంలో బుధవారం సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దొంత గాని వీరబాబును హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ పరామర్శించారు.

 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను తుంగలో తొక్కిన ఘనత కెసిఆర్ ది అన్నారు. చిన్న ఉద్యోగులపై ఉక్కు పాదం మోపటం కెసిఆర్ కు సబబు కాదు అన్నారు.

 

తెలంగాణ ఉద్యమాలు ఎందరో విద్యార్థులు అమరులైన వారి కుటుంబాలను పట్టించుకో లేదు, కనీసానికి వారిని పరామర్శించలేదు, తెలంగాణ వస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని ఇచ్చిన మాటను తప్పినాడు, పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని అన్నారు.