Ex mla | మాజీ ఎమ్మెల్యే కొత్తకోట కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట కన్నుమూత

మనసాక్షి, మహబూబ్ నగర్

మాజీ శాసనసభ్యులు కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఏ ఐ జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు.

 

ఆయన మహబూబ్ నగర్ లోని దేవరకద్ర నుంచి రెండుసార్లు , మక్తల్ నియోజకవర్గం నుంచి ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొత్తకోట దయాకర్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు.

 

కొత్తకోట దయాకర్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం పర్కాపూర్ గ్రామం . ఆయన టిడిపి నుంచి 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

 

2009లో కొత్తకోట దయాకర్ రెడ్డి మక్తల్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య సీత దేవరకద్ర నియోజకవర్గం నుంచి గెలుపొంది భార్యాభర్తలిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టే రికార్డు సృష్టించారు.