నల్గొండ : కెసిఆర్ పాలన పై మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు

నల్గొండ : కెసిఆర్ పాలన పై మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు

నల్గొండ , మనసాక్షి :
రాష్ట్రంలో వైన్.. డైన్.. సైన్ లతో కేసీఆర్ పాలన అవినీతి, విధ్వంసకర పరిపాలన చేస్తున్నారని వరంగల్ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సెటైర్లు వేశారు.

 

గురువారం నల్గొండ పట్టణంలోని మనోరమ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు కావస్తున్నా.. అవినీతి విలయతాండవం చేస్తుందని విమర్శించారు.

రాష్ట్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాలకే పరిమితమైందని, వాస్తవానికి 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

కెసిఆర్ ప్రభుత్వం అవినీతిపైన కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం 26 లక్షల కోట్ల బడ్జెట్ ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని దానిలో సగం కెసిఆర్ కుటుంబ సభ్యులకు దోసుకున్నారని విమర్శించారు.

రాష్ట్ర గవర్నర్ కెసిఆర్ అవినీతి పైన ఎప్పటికప్పుడు నివేదికలు పంపించి కెసిఆర్ అవినీతిపైన కేంద్ర నిఘా సంస్థల అప్పజెప్పాలని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అప్పుల పైన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

కాలేశ్వరం ప్రాజెక్టు తో ఒక ఎకరం కూడా అదనంగా నీరు ఇవ్వడంలేదని కేవలం కాలేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ల కోసమే కట్టారని విమర్శించారు . బిస్వల్ కమిటీ సూచించిన విధంగా 1.92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన వాటిని భర్తీ చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.

 

ఉద్యోగ భృతి, మహిళలకు వడ్డీలేని రుణాలను అందించలేదని పేర్కొన్నారు. దళిత బంధు. గిరిజన బంధువల కోసంఆ కేవలంరు లక్షల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలోని దళితులకు గిరిజనుల అభివృద్ధి జరిగేదన్నారు.

 

ఆయా నియోజకవర్గాలలో దళిత బంధు అబ్ధిదారుల ఎంపికలలో అవకతవకలకు పాల్పడిన ఎమ్మెల్యేల పైన ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.