మిర్యాలగూడ : కుటుంబ సభ్యులే దొంగల ముఠా.. రాత్రిపూటనే వారి వేట..!
మిర్యాలగూడ : కుటుంబ సభ్యులే దొంగల ముఠా.. రాత్రిపూటనే వారి వేట..!
నల్గొండ, మనసాక్షి :
కుటుంబ సభ్యులే ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటన నల్లగొండ జిల్లా లో చోటుచేసుకుంది. వ్యవసాయ పొలాల్లోనే ట్రాన్స్ఫార్మర్లే వారి లక్ష్యం.
నల్గొండ జిల్లాలోని వాడపల్లి, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, త్రిపురారం, నిడమానూర్, తిప్పర్తి, నల్గొండ, నకిరేకల్, చిట్యాల పోలీస్ స్టేషన్ ల పరిదిలోని వ్యవసాయ పొలాల వద్ద రైతులు వ్యవసాయ మోటార్ లకు కరెంట్ సప్లయ్ నిమ్మిత్తము ఏర్పాటు చేసుకున్నా ట్రాన్స్ఫార్మర్ లను లక్ష్యం గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
అట్టి వాటిని డ్యామేజ్ చేసి అందులో గల కాపర్ కాయిల్స్ ను అయిల్ ను దొంగిలించి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తమ కారులో హైదరాబాద్ లోని పాత ఇనుము షాప్ లలో అమ్ముకుంటూ నేరాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో, మిర్యాలగూడ రూరల్ సీఐ. వీరబాబు ఆద్వర్యంలో వాడపల్లి ఎస్‌ఐ, సిబ్బంది టాస్క్ఫోర్స్ సిబ్బంది, సమన్వయంతో ఇట్టి నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు.
గురువారం ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేరస్తులైన మెగావత్ రంగనాయక (పిడుగురాళ్ల), జటావత్ ఇమామ్ నాయక్, జటావత్ మౌలాన, షేక్ జటావత్ వలీ నాయక్ (సింగరాయపాలెం మాచవరం తండ మండలం పల్నాడు జిల్లా), కేతవత్ సునిల్ (యల్మలమంధ గ్రామం, చందంపేట మండలం నల్గొండ జిల్లా). వీరంతా ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు నేరస్తులు.
గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ నందు నివాసం ఉంటూ తమ యొక్క సొంత కారులో హైదరాబాద్ నుండి ఉదయం సమయంలో వచ్చి రోడ్ ప్రక్కన వ్యవసాయ పోలాలలో ఉండే ట్రాన్స్ఫార్మర్ లను లక్ష్యం గా చేసుకునేవారు. తదుపరి రాత్రి సమయంలో తమ కారులో వచ్చి అట్టి ట్రాన్స్ఫార్మర్ లని ఆఫ్ చేసి మూతలను డ్యామేజ్ చేసి అందులో గల కాపర్ కాయిల్స్ అయిల్ ను దొందగిలించుకొని తమ కారులో హైదరాబాద్ తీసుకెళ్లేవారు.
తమకు తెలిసిన మూడవత్ నరేశ్ అను పాత ఇనుము వ్యాపారస్తులకు తక్కువ ధరకు అమ్ముతు అక్రమంగా సొమ్ము చేసుకునేవారు. ప్రస్తుతం వారు ఇద్దరు పరారీలోఅన్నారు.
అర్ద రాత్రి సమయంలో వాడపల్లి ఎస్ఐ తన సిబ్బంధి తో కలసి పెట్రోల్లింగ్ చేయుచు నర్సాపురం రోడ్ లోని రైల్వ ట్రాక్ వద్దకు వెళ్ళేసరికి అక్కడ ఒక తెలుపు రంగు కారు పొలాల వద్ద నిలిపి యుండి దాని నందు 5 మగ వ్యక్తులు ఉండి, వారు పోలీస్ వారిని చూసి అనుమానస్పదంగా ప్రవర్తించగా, వారిపై అనుమానం కలిగి విచారించగా సదరు వ్యక్తులు తాము చేసిన నేరాలను ఒప్పుకున్నారు.
ఇట్టి కేసులను చేధించి ప్రజలకు పోలీస్ ల పై మరింత నమ్మకం కలిగేలా చేసిన మిర్యాలగూడ డి.యస్.పి రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో సిఐ మిర్యాలగూడ రూరల్ వీరబాబు, టాస్క్ఫోర్స్ సి.ఐ రమేష్ బాబు, వాడపల్లి ఎస్ఐ రవి, టాస్క్ఫోర్స్ యస్. ఐ మహేందర్ వారి సిబ్బంది ని ఎస్పీఅబినందించడం జరిగింది.
అరెస్టు చేసినవారి పై మొత్తం
34 కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
వాడపల్లి పోలీస్ స్టేషన్ లో 11 కేసులు,
త్రిపురారం పోలీస్ స్టేషన్ లో -04 కేసులు
తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో – 03 కేసులు, నల్గొండ II – టౌన్ పోలీస్ స్టేషన్ లో- 03 కేసులు
మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ – 2 కేసులు,
అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్ లో – 2 కేసులు చిట్యాల పోలీస్ స్టేషన్ లో 2 కేసులు,
మిర్యాలగూడ-II టౌన్ పోలీస్ స్టేషన్ – 2 కేసులు
నల్గొండ I – టౌన్ పోలీస్ స్టేషన్ లో- 01 కేసు
నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో- 01 కేసు . వేముపల్లి పోలీస్ స్టేషన్– 1 కేసు,
నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు, నిడమానూర్ పోలీస్ స్టేషన్ లో – 1 కేసు నమోదు అయినట్లు ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. రూ.5 కోట్లు అప్పు ఇస్తామని నమ్మించి, 60 లక్షలతో పరార్..!
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!









