Rythu : యూరియా కోసం రైతుల కష్టాలు.. క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు..!
Rythu : యూరియా కోసం రైతుల కష్టాలు.. క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు..!
పెన్ పహాడ్, మన సాక్షి :
యూరియా కోసం రైతులు నాన్న కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. గంటల తరబడి నిలబడి యూరియాను కొనుగోలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో వివిధ గ్రామాలలో ఎరువుల దుకాణాలలో యూరియా కొరత ఏర్పడింది. సోమవారం మండల పరిధిలోని అనంతారం పిఎసిఎస్ ఆఫీసు యూరియా కోసం ఉదయం ఎనిమిది గంటల నుండి రైతులు భారీగా వరుసలో నిలబడ్డారు. ఎక్కువసేపు నిలబడలేక రైతులు పాదరక్షాలను లైన్ లో పెట్టారు.
యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చి క్యూలో నిలుపుకున్నప్పటికీ పిఎసిఎస్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా కార్యాలయాన్ని తెరవలేదు. ఉదయం 11: 20కు పిఎసిఎస్ ఆఫీసు తెరవడంతో భారీగా రైతులు భారీగా గుమ్మిగూడినారు. ఇప్పటికైనా మండల వ్యవసాయ అధికారులు మండలంలో యూరియా కొరత లేకుండా చూడాలని ఆయన వ్యవసాయ అధికారులను కోరినారు.
వరి నాట్లు వేసి 30 రోజులు గడిచినప్పటికీ యూరియా దొరకకపోవడంతో రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు ఫర్టిలైజర్ షాపులలో యూరియా దొరకకపోవడంతో పిఎసిఎస్ వద్ద కు రైతులు భారీగా తరలివచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు తమ గోడును పట్టించుకుని న్యాయం చేయాలని మండల వ్యవసాయ అధికారులను కోరుతున్నారు.
క్యూలో మండలానికి చెందిన రైతులు బోలక సౌడయ్య, మామిడి సైదులు, మామిడి శ్రీనివాసు, బైరెడ్డి ఉపేందర్ రెడ్డి, మామిడి బిక్షం, ఎర్ర సత్యం, మేకల శ్రీను అన్నారం, నాగులపాడు, దోసపాడు, పొట్లపాడు, నారాయణ గూడెం, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
MOST READ :
-
Railway Recruitment : ఇండియన్ రైల్వేస్ లో కొలువుల జాతర.. వేతనం రూ.35000.. వెంటనే దరఖాస్తు చేయండి..!
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్నకు బెయిల్..!
-
Holiday : రేపు విద్యాసంస్థలకు సెలవు..!
-
Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!
-
Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!









