నల్లగొండ : రైతులకు సంకెళ్లు వేసి సంబరాలు జరుపుకుంటుంది

నల్లగొండ : రైతులకు సంకెళ్లు వేసి సంబరాలు జరుపుకుంటుంది

కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు

నల్లగొండ , మన సాక్షి:
రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు విమర్శించారు.

 

సోమవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని ధ్వజమెత్తారు.

 

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక ఫలితాలు పునరావృత్తమవుతాయని అన్నారు.

 

తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

 

ఈ విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య,

 

వైస్ ఎంపీపీ జిల్లాపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్, నాయకులు పాశం నరేష్ రెడ్డి,చర్లపల్లి గౌతమ్, సూరెడ్డి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.