Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Tahsildar : రైతులు రెవిన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి..!
Tahsildar : రైతులు రెవిన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి..!
ముదిగొండ, (మన సాక్షి) :
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని భూభారతి చట్టం (2025) సంవత్సరంలో అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ జూన్ 3వ తారీకు నుండి ముదిగొండ మండలం పరిధిలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని తహసీల్దార్ సునీతా ఎలిజబెత్ తెలిపారు.
భూ యజమానులు రైతులు తమ భూమి రికార్డుల యందు ఏమైనా తప్పులు ఉన్నా లేదా అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల యందు పేర్లు నమోదు కాకపోయినా, మరే ఇతర భూ సమస్యలు ఉన్నా వచ్చే ఈ రెవెన్యూ సదస్సులో రైతులు పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.









