Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!
Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!
మఠంపల్లి, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని చౌట్టపల్లి గ్రామ పంచాయతీలో రుణ మాఫీకి అర్హత ఉండి రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ చేయుటకు కుటుంబ ధ్రువీకరణ పత్రాలను గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటి సర్వే చేశారు. మండల ఎంపిడిఓ హరి సింగ్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ ఈ సర్వేను దగ్గరుండి పర్యవేక్షించారు. సర్వేలో పాల్గొని వారు మాట్లాడుతూ ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుంది.
ఎవరు ఆందోళన చెందకుండా దరఖాస్తులను రైతులు వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని సూచించారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు ఒక రెవెన్యూ చోపున్న వ్యవసాయ అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులను తీసుకుంటారని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దరఖాస్తులు తీసుకోవడానికి వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
BREAKING : మిర్యాలగూడలో సంగం డైరీ వద్ద రైతుల ఆందోళన.. ఉద్రిక్తత..!
Khammam : రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల.. రుణమాఫీ పై ఏమన్నారంటే..!
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!









