Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

నల్గొండ జిల్లా దామచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు..!

నల్గొండ జిల్లా దామచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం బొత్తలపాలం వద్ద ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని డీసీఎం లారీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు ఇద్దరు దేవరకొండ పట్టణానికి చెందిన యాది, రిజ్వాన్ గా పోలీసులు గుర్తించారు. కేబుల్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LATEST UPDATE : 

Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!

Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

మరిన్ని వార్తలు