Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!

మన సాక్షి, సూర్యాపేట :

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. సూర్యాపేట జిల్లా చెవ్వెంల మండలం ఐలాపురం సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మరో 15 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. బస్సు టైర్ పేలడంతో పక్కనే ఉన్న ఇసుక లారీని ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో బస్సు నుజు నుజ్జయింది.

ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సూర్యాపేట డిఎస్పి రవి ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు