BIG BREAKING : ఎఎమ్మార్పీ ప్రధాన కాలువలో తండ్రీకొడుకులు గల్లంతు..!
BIG BREAKING : ఎఎమ్మార్పీ ప్రధాన కాలువలో తండ్రీకొడుకులు గల్లంతు..!
కనగల్, మనసాక్షి :
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. ఏఎంఆర్పి ప్రధాన కాలువలో తండ్రి కొడుకు గల్లంతైన విషాద ఘటన శనివారం శాబ్దుల్లాపురంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….
కనగల్ మండలం శాద్దులాపురం గ్రామానికి చెందిన సురవరం దామోదర్ (39), అతని కొడుకు ఫణీంద్ర వర్మ అలియాస్ బిట్టు (14) స్నానం చేయడానికి గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. కాలువలో ఈత కొడుతూ స్నానం చేస్తున్న సమయంలో మొదటగా ఫణీంద్ర వర్మ వరద తాకిడికి కాలువలో కొట్టుకుపోయాడు.
కొడుకును కాపాడేందుకు తండ్రి నీటి ప్రవాహంలోకి వెళ్లగా వరద అధికంగా ఉండడంతో తండ్రి సైతం ఆ నీటిలో కొట్టుకుపోయాడు. ఇదే సమయంలో వారి బంధువులు సైతం కొందరు అక్కడే ఉన్నప్పటికీ కాలువలో వరద అధికంగా ప్రవహిస్తున్నందున ఏమీ చేయలేక నిస్సహాయులుగా నిలిచిపోయారు.
ఈత కొడుతున్న చోట రేగట్టె వాగుపై కాలువ నీరు ప్రవహించేందుకు అడ్డంగా నిర్మించిన అక్విడక్ట్స్ చిన్నగా ఉండడంతో నీటి ప్రవాహం అత్యంత వేగంగా అక్విడెక్ట్ లో ప్రవహిస్తుంది. ఈత వచ్చినప్పటికీ అందులో పడితే నీటి ప్రవాహం అధికంగా ఉంటున్నందున కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. స్థానికుల సమాచారంతో కనగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఇద్దరి ఆచూకీ కనబడలేదు.
కాగా దామోదర్ కుటుంబం కొంతకాలంగా నల్లగొండ మండలం బుద్ధారంలో ఉంటున్నారు. దీపావళి పండుగ కావడంతో సొంతూరికి తండ్రి కొడుకు వచ్చారు. పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం జరగడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాలువలో నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహం తగ్గితేనే గల్లంతైన వారి ఆచూకీ తెలిసే ఆస్కారం ఉంది.
LATEST UPDATE :
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ప్రతి ఒక్కరికి ఉపయోగమే, అదేంటంటే..!
-
Gold Price : దీపావళి వెళ్ళింది.. బంగారం ధర మరింత పతనం.. ఇంకా తగ్గనున్నదా..?
-
TG News : పర్యాటకులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ లో లాంచీ సేవలు, టూర్ ప్యాకేజీలు..!
-
District collector : 48 గంటల్లో ధాన్యం చెల్లింపులు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..!









