Breaking NewsTOP STORIESక్రైంతెలంగాణహైదరాబాద్

Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!

Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!

హైదరాబాద్ , మనసాక్షి :

తల్లిదండ్రులు పిల్లలపై ఎంతో ప్రేమను పెంచుకుంటారు. చిన్నతనంలోనే వారి ముద్దు మాటలు.. పలుకులతో వారిని వారే మరిచిపోతుంటారు . పిల్లలు లేనిది జీవితం ఎందుకు అనేలా ఉంటారు. ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ, ఆ చిన్నారి పలికే ముద్దు మాటలకు తండ్రి ఎంతో మురిసిపోయేవాడు. ఆ ఇద్దరి అనురాగం దేవుడికి కూడా కన్ను కుట్టిందేమో..

 

ఆ కుటుంబాన్ని ఒకసారిగా చిన్న భిన్నం చేశాడు . ఆ ఇంటిని విషాదంలో కమ్మేసింది. ఎంతో అల్లారుముద్దుగా, అమితమైన ప్రేమతో పెంచుకున్న కుమార్తె  విగత జీవితం మారిపోయింది. కళ్ళముందే ఆ చిన్నారి మృతి చెందడంతో తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. చిట్టితల్లి నేను కూడా నీ వెంటే అంటూ ఆ తండ్రి కూడా ప్రాణాలు తీసుకున్నాడు.

 

MOST READ : 

1. Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!

2. నల్లగొండ  : సింగిల్ ఇన్వెస్ట్.. డబుల్ ప్రాఫిట్, రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం..!

3. NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?

4. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!

5. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!

6. మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!

 

ఈ ఘటన హైదరాబాదులోని ఖైరతాబాద్ లో చోటుచేసుకుంది. తండ్రి కూతుర్ల మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఖైరతాబాద్ కు చెందిన కిషోర్ కు ఐదేళ్ల కూతురు ఆరాధ్య ఉంది. ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. కళ్ళముందే కూతురు మరణించడానికి కిషోర్ తట్టుకోలేకపోయాడు. కూతురు మృతి ని తట్టుకోలేక కిషోర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

కూతురు మృతితో కోలుకోవాలని ఆ కుటుంబం ఇంటి యజమానిని కూడా కోల్పోవడంతో ఆ కుటుంబానికి పెద్ద షాక్ అయింది . ఈ హృదయ విదారక సంఘటన స్థానికులను కూడా ఎంతో కలచివేసింది. రైల్వే పోలీసు సమాచారం తెలుసుకొని కిషోర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఓకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో ఆ కాలనీ మొత్తం విషాదంలో నిండింది.

మరిన్ని వార్తలు