District collector : 28న గ్రామీణ ఓటర్ల తుది జాబితా.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!
District collector : 28న గ్రామీణ ఓటర్ల తుది జాబితా.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!
పెద్దపల్లి, మన సాక్షి ప్రతినిధి.
గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పన పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13న గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో గల అభ్యంతరాలు, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను సెప్టెంబర్ 21 లోపు సంబంధిత మండలాల ఎంపీడీఓలకు లిఖిత పూర్వకంగా సమర్పించాలని, సెప్టెంబర్ 26 లోపు అభ్యంతరాలను పరిష్కరించి, సెప్టెంబర్ 28న తుది ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.
సెప్టెంబర్ 19న మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గ్రామీణ ఓటర్ జాబితా పై సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ఓటరు జాబితాలో ఉన్న అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదుకు సెప్టెంబర్ 21 వరకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఒక కుటుంబంలోని సభ్యులందరికీ ఓకే వార్డులో ఓట్లు ఉండేలా కార్యాచరణ రూపొందించామని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ఓటరు జాబితా పకడ్బందీగా తయారు చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సంపూర్ణ సహకారం అందజేయాలని, ఓటర్ జాబితా రూపకల్పన పై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర భూచయ్య, సిపిఐ పార్టీ ప్రతినిధి టి. సదానందం, తెదేపా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎ.తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి శశి భూషణ్, భారాసా పార్టీ ప్రతినిధి ఉప్పు రాజ్ కుమార్, భాజాపా పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ పి.సంపత్ రావు, సిపిఎం పార్టీ ప్రతినిధి ముత్యం రావు, బీఎస్పీ పార్టీ ప్రతినిధులు శారద రాజ నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ రామగుండం ఇన్చార్జి ఆశ్ పాషా, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!
Suryapet : రూ.1.25 లక్షలు పలికిన గణేష్ లడ్డు.. పంపిణీ చేసిన మాజీ మంత్రులు..!
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!









