దేవరకొండ ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు మృతి.. ఉద్రిక్తత..!
దేవరకొండ ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు మృతి.. ఉద్రిక్తత..!
దేవరకొండ మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని రెయిన్బో ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో 5 రోజుల పసికందు వైద్యం పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం డిండి మండలం ఎర్రారం సోమ్లా తండాకు చెందిన ఇస్లావత్ రమేష్,జ్యోతి దంపతులకు 2018 లో మొదటి కాన్పులో అమ్మాయి పుట్టగా అప్పటినుంచి పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ నెల 3 న దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో అబ్బాయి పుట్టాడు.
బాబు కు పసిరికలు ఉండడంతో 6 న తన ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకురమ్మని వైద్యుడు బాబురామ్ తల్లిదండ్రులు లకు చెప్పడంతో వారు ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. రెయిన్బో హాస్పిటల్ లో 6 నుంచి చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం బాబు మరణించడంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే బాబు మృతి చెందాడని బంధువులు తెలిపారు.
తమకు బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో భయమైతుందని డాక్టర్ కి చెప్పినప్పటికీ వినకుండా అంత బాగానే ఉందంటూ వైద్యుడు బాబురామ్ చెప్పాడని ఇంతలోనే బాబు మృతి చెందాడంటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి లో డ్యూటీ వైద్యం చేస్తూ సొంత ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకురమ్మని వైద్యుడు బాబురామ్ ఎలా చెప్పారు అంటూ బంధువుల ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ సొంత ప్రయివేట్ ఆసుపత్రి నిర్మించుకున్న ప్రవేటు ఆసుపత్రులను సిజ్ చేయాలనీ బంధువులు డిమాండ్ చేశారు. వైద్యుడి నిర్లక్షంతో పసికందు వైద్యం వికటించి చనిపోవడంతో బంధువులు ఆసుపత్రిలోని అద్దాలు,సామగ్రిని ధ్వంసం చేశారు.
వైద్యుడి పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
LATEST UPDATE :
BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!
నల్లగొండ మున్సిపాలిటీకి అత్యుత్తమ గౌరవం.. దేశంలోనే రెండో స్థానం.. 25 లక్షల నగదు పురస్కారం..!
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!









