BREAKING: మిర్యాలగూడలో ఐదుగురు గంజాయి, మత్తు టాబ్లెట్ల విక్రేతల అరెస్ట్.. రిమాండ్..

గంజాయి, మత్తు టాబ్లెట్లను విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను మిర్యాలగూడ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు స్థానిక టూ టౌన్ పీ ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి కేసు వివరాలను వెల్లడించారు.

BREAKING: మిర్యాలగూడలో ఐదుగురు గంజాయి, మత్తు టాబ్లెట్ల విక్రేతల అరెస్ట్.. రిమాండ్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

గంజాయి, మత్తు టాబ్లెట్లను విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను మిర్యాలగూడ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు స్థానిక టూ టౌన్ పీ ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి కేసు వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడ టూ టౌన్ పరిధిలో వాహనాల తనిఖీ చేపడుతున్న క్రమంలో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తులను విచారించగా గంజాయి గుట్టు బయటపడిందన్నారు.

ఏపీలోని మాచర్ల ఎరకల వాడ కు చెందిన బత్తుల కుమారి నుంచి మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన పలువురు యువకులు గంజాయిని కొనుగోలు చేసి అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మహాలక్ష్మీ రైస్ మిల్ డ్రైవర్ చలసాని కోటేశ్వరరావు, వసంత రైస్ మిల్ డ్రైవర్ సంపత్ అశోక్, ఇందిరమ్మ కాలనీకి వాసి పండ్ల వ్యాపారి నేనావత్ అశోక్,
మటన్ షాప్ నడిపించే నల్గొండ పట్టణానికి చెందిన మహమ్మద్ షంషీర్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నుంచి 2.1 కేజీల ఎండు గంజాయి, 3600 స్పాస్మో ప్రోక్సివాన్ ప్లస్ టాబ్లెట్ లను, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టూ టౌన్ సీఐ నాగార్జున, ఎస్ఐ లు కృష్ణయ్య, రాంబాబు, కానిస్టేబుల్స్ కళ్యాణ్, బాలకృష్ణ, ధనుంజయ, రాగ్యా నాయక్, అక్బర్ పాష, రామకృష్ణ, శ్రీనివాస్ ఉన్నారు.

ALSO READ  : 

BREAKING : జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై మండిపడ్డ వైద్యులు, సిబ్బంది నిరసన.. సందర్శించిన అదనపు కలెక్టర్..!

BREAKING : ముందస్తు సెలవు లేకుండా పాఠశాలకు గైర్హాజరైతే సస్పెండ్.. ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!