Gold Price : వరుసగా మూడో రోజు.. చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!
Gold Price : వరుసగా మూడో రోజు.. చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు భారతీయ మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. వారం రోజుల పాటు తగ్గిన బంగారం ధర ఈనెల 18వ తేదీ నుంచి వరుసగా పెరుగుతూ వస్తుంది.
భారీగా బంగారం ధరలు పెరుగుతుండడంతో పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీకమాసంలో శుభకార్యాల సీజన్ లో బంగారం ధరలు పెరగడం వారిని ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం (నవంబర్ 20) వ తేదీన 24 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు 5500 పెరిగింది. 22 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు 5000 రూపాయలు పెరిగింది.
హైదరాబాదులో 10 గ్రాముల (తులం బంగారం) 24 క్యారెట్స్ ధర బుధవారం 77,620 ఉంది. 22 క్యారెట్స్ తులం రూ.71,150 గా ఉంది. 100 గ్రాముల (24 క్యారెట్స్) ధర 7,76,200 రూపాయలు కాగా 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 7,11,500 ఉంది.
మరింత పెరిగే అవకాశం :
కార్తీక మాసం సీజన్ ప్రారంభం కాగానే వారం రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మళ్లీ మూడు రోజులుగా వేగం పంజుకున్నాయి. అయితే బంగారం ధర మరో రెండు, మూడు రోజుల్లో రూ. 80,000 లకు చేరుకునే అవకాశం ఉందని పలువురు వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.
దేశంలోని వివిధ పట్టణాలలో బంగారం ధరలు :
చెన్నై, ముంబై, కలకత్తా, హైదరాబాద్, కేరళ రాష్ట్రాలలో 24 క్యారెట్స్ బంగారం ఒక గ్రాము 77 62 రూపాయలు కాక 22 క్యారెట్స్ ఒక గ్రాము బంగారం ధర 7115 రూపాయలుగా ఉంది.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
Gold Price : తగ్గినట్టే తగ్గి పెరిగిన పసిడి.. తులం బంగారం ధర ఎంతంటే..!
-
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హత ఉంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
Toll Tax : ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!









