Nalgonda : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్ట్..!
Nalgonda : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్ట్..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అన్నేపర్తి లోని 12 వ బెటాలియన్ లో ఎక్ పోలీస్ వ్యవస్థ ను అమలు చేయాలని, ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్ల కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలపడానికి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లారు.
నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి,అన్నేపర్తి మాజీ సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి,నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నారాబోయిన బిక్షం మాజీ ఎంపీటీసీ పొగాకు గట్టయ్య,బడుపుల శంకర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి బొజ్జ వెంకన్న తవిటి కృష్ణ మెరుగు గోపి, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, లను పోలీసులు అడ్డుకొని బెటాలియన్ లోపటికి వెళ్లకుండా నిరోధించడంతో పోలీసుల తీరుపై భూపాల్ రెడ్డి మండిపడ్డారు.
తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన బెటాలియన్ కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయడం అమానుషం అని ఆగ్రహం వ్యక్తం చేసిన భూపాల్ రెడ్డి అనంతరం భూపాల్ రెడ్డి తో సహా నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ తరలించారు.
LATEST UPDATE :
-
Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు..!
-
Viral Video : చల్లగా బీరు తాగుదామనుకుంటే.. ఓపెన్ చేయబోయి కంగుతిన్నారు, చంపేస్తారా బాబు.. (వీడియో)
-
Viral Video : తప్ప తాగిన ఏఎస్ఐ.. నడిరోడ్డుపై బాలికకు లిప్ కిస్.. (వీడియో)
-
Viral Video : లవ్ రెడ్డి సినిమా చూసి ప్రేక్షకురాలు ఎమోషన్.. నటుడు NT రామస్వామి పై థియేటర్ లోనే మహిళ దాడి.. ( వీడియో)









