హత్య యత్నం కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష..!

హత్య యత్నం కేసులో ఓ వ్యక్తికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధించిన సంఘటన శుక్రవారం కల్వకుర్తి కోర్టులో చోటుచేసుకుంది.

హత్య యత్నం కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష..!

నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి, మనసాక్షి:

హత్య యత్నం కేసులో ఓ వ్యక్తికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధించిన సంఘటన శుక్రవారం కల్వకుర్తి కోర్టులో చోటుచేసుకుంది. ఎస్ ఐ రమేష్ తెలిపిన వివరాలు. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన దేవర బోయిన గోవిందు కుటుంబ కలహాలను మనసులో పెట్టుకొని వరుసకు బావ అయినా కోట ముత్యాలుపై కత్తితో దాడి చేశాడు.

దాడిలో ముత్యలుకు తీవ్ర గాయాలు అయినట్లు ఎస్ఐ చెప్పారు. బాధితుడి పిర్యాదు మేరకు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 227/2022/అండర్ సెక్షన్ 307ఐపిసి కింద కేసు నమోదు అయ్యింది. అప్పటి సిఐ సైదులు కేసును దర్యాప్తు చేసి నేరాభియోగ పత్రాన్ని కోర్టు లో దాఖలు చేశారు.

ALSO READ : మాడ్గులపల్లి : దారుణ హత్య.. భార్యను హతమార్చిన భర్త..!

ఈ మేరకు పిపి తిరుపతయ్య కేసుకు సంబంధించి 15 మంది సాక్షులను కోర్టు లో ప్రవేశ పెట్టారు. సాక్షుల పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం కల్వకుర్తి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి. ఎ. శ్రీదేవి నేరస్తుడైన దేవరబోయిన గోవిందు కు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష తో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు ఎస్ ఐ రమేష్ తెలిపారు.

సదరు కేసులో సాక్షులను ప్రవేశపెట్టడంలో, కేసును సజావుగా నడిపించడంలో కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్ బాలు యాదవ్, ఎస్ఐ రమేష్ లను డి.ఎస్.పి పార్థసారథి గౌడ్, సిఐ ఆంజనేయులు అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.

ALSO READ : కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్..! (ఆడియో)