మిర్యాలగూడ : ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!

లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి కోరారు.

మిర్యాలగూడ : ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని వర్షిత హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, మలక్ పేట యశోద ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్, కిడ్నీ, గుండె వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారు పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు . ఇలాగే మరింత మంది సామాజిక వేత్తలు , స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు వచ్చి మారుమూల గ్రామాల నిరుపేద ప్రజలకు విద్య, వైద్యం అదేలా పలు కార్యక్రమాలు చేయాలని వారికి మా ప్రోత్సాహం , సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని అన్నారు.

ALSO READ: Mahalakshmi : మహాలక్ష్మి పథకంలో రూ. 2500లకు అందరూ అర్హులు కాదా.. అర్హతలు ఇవేనా..!

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు కర్నాటి రమేష్ ,ఆసుపత్రి ఎండి కూటాల రాంబాబు,
లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ కార్యదర్శి లింగయ్య, కోశాధికారి బాబురావు, సీనియర్ లైన్స్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ కే ఎన్ ప్రసాద్, ముక్కపాటి వెంకటేశ్వరరావు , డాక్టర్ రాజు పాల్గొన్నారు.